జనమంతా సంక్రాంతి సంబరాల మూడ్‌లో ఉంటే.. ముసురు మాత్రం ఆ సంబరాలను ఆవిరి చేసే ప్రమాదం కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం అందిస్తున్న వివరాలను బట్టి.. నైరుతి బంగాళాఖాతంలో  ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.



కర్ణాటక నుంచి ఉత్తర ఒరిస్సా వరకు ద్రోణి విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాలు కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉత్తరాంధ్రలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో  అక్కడక్కడ మాములు వర్షాలతో పాటు.. కొన్ని చోట్ల అధిక వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ పట్నం వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. వాతావరణ శాఖ చెప్పినట్టు 3 రోజులు వర్షాలు కురిస్తే  సంక్రాంతి ఆనందం నిజంగా ఆవిరైనట్టేనేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: