ప్ర‌తి సంవ‌త్స‌రం సంక్రాంతి పండుగ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంతో క‌న్నుల పండుగ‌గా జ‌రుపుకుంటారు. అక్క‌డ‌క్క‌డ త‌రుచూ ఏదో ఒక చోట చిన్న చిన్న ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. తాజాగా ఆనందంగా, సంతోషంగా నిర్వ‌హించుకోవాల్సిన సంక్రాంతి సంబ‌రాలు ఆ ముగ్గురి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లిలోనిఇ ఐదోమైలు వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాద‌ము సంభ‌వించింది.

స్థానికులు, పోలీసులు ఈ ఘ‌ట‌న గురించి మీడియాకు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి మండలం కొత్త‌వారిప‌ల్లె గ్రామానికి చెందిన  వ్య‌క్తులు రెండు ద్విచ‌క్ర వాహ‌నాల‌పై ప్ర‌యాణిస్తున్నారు. వీరు మాట్లాడుకుంటూ ప్ర‌యాణిస్తుండ‌గానే మార్గ మ‌ధ్య‌లో ఎదురుగా అతివేగంగా  వ‌చ్చిన మ‌రొక ద్విచ‌క్ర వాహ‌నం ఒక్క‌సారిగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికీ తీవ్ర‌గాయాలు అయ్యాయి. వారిని వెంట‌నే తిరుప‌తిలోని రుయా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ముగ్గురు మర‌ణించారు. మృతి చెందిన ముగ్గురు ఇస్మాయిల్‌, సిద్దిక్‌, శ్రీ‌నివాసులు అని పోలీసులు వెల్ల‌డించారు. పండుగ రోజే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం తిరుప‌తి రుయా ఆసుప‌త్రి  మార్చురీ వ‌ద్ద మృతుల కుటుంబ స‌భ్యులు బోరున విల‌పిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: