తిరమలలో కొలువై యున్న శ్రీ వైంకటేశ్వరుడి వైభవం చూసి తీరవలసినదే  కానీ, పూర్తిగా వర్ణించడం ఎవరి తరమూ కాదు. ఏడుకొండలలో కొలువై యున్న శ్రీ నివాస ప్రభువుకు  బ్రహ్మోత్సవాలు,  సంవ  త్సరోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, వారోత్సవాలు,  నిత్యోత్సవాలు,...ఇలా చాలాసేవలు జరుగుతాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తాజాగా ఒక సేవను రద్దు చేసింది. అది ఏమిటో తెలుసా మీకు ?


తిరుమల వాసునికి ప్రతి నెలా పౌర్ణమి రోజున పున్నమి గరుడ సేవను నిర్వహించడం ఆనవాయితీ. తరతరాలుగా ఈ ఉత్సవసేవ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ఈ నెల లో పౌర్ణమి తిధి 17 వ తేదీ వచ్చింది. అదే ఆనవాయితీ ప్రకారం  17 తేద0ీ గరుడసేవ నిర్వహించాల్సి ఉంది. కానీ దేవస్థానంలో ఆపదమొక్కుల వానికి  అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి.  దీంతో స్వామి వారికి గరడ సేవ నిర్వహించడం, సమయభావం కారణంగా సాధ్యం కాదు. ఈ క్రమంలో 17 వ తేదీ నిర్వహించాల్సిన గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని టిటిడి  ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd