ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆనవాయితీ తప్పలేదు. పరిపాలనా పరమైన పనుల్లో బిజీ బిజీ గా ఉన్నా కూడా ఆయనకు  ఆంధ్ర ప్రదేశ్ అంటే మక్కువ. తెలుగు పండుగలను ఆయన తెలుగు వారి మధ్యన జరుపుకోవడం ఆనవాయితీ. ఈ దఫా కూడా ఆయన పెద్ద పండుగను జరుపుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చారు. ఏపిలో ఎక్కడికి వచ్చారో తెలుసా ?
 సంక్రాంతి పండుగ కార్యక్రమాలలో భాగంగంగా సోమవారం రాత్రి స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకున్నారు. ప్రతి ఏటా ఆయన తెలుగు పండుగలను తన మానస పుత్రిక స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరుపుకోవటం ఆనవాయితీ. ఈ ఏడాది భోగీ, సంక్రాంతి, కనమ పండుగలు చెన్నై లోని  కుమారుడి నివాసం లోజరుపుకున్న ఆయన సోమవారం రాత్రి ఆంధ్ర ప్రదేశ్ కు విచ్చేశారు. గన్నవరంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకున్నారు.  మంగళవారం ఆయన అక్కడి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఆ తరువాత విశాఖపట్నం వెళ్లనున్నట్లు సమాచారం. ఉప రాష్ట్ర పతని వెంకయ్య నాయుడు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం నుంచి ప్రత్యేక రైలులో గన్నవరం  రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ  ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్, ఏపి సిఎస్ .సమీర్ శర్మ, డిజిపి గౌతమ్ సవాంగ్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లం పల్లి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి: