ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఓ బృహత్ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఇవాళ జగన్ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ప్రారంభిస్తున్నారు. వందేళ్ల  తర్వాత దేశంలోనే తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే ఫలితాలను ప్రజలకు జగన్ అంకితం చేస్తున్నారు. తొలి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానుల భూముల రీ సర్వే పూర్తయింది.

 
ఇప్పటి వరకు  29,563 ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేశారు. నేడు 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్‌  సేవలను సీఎం జగన్ ప్రారంభిస్తారు. మొత్తం జూన్‌ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలోని భూముల రీసర్వే పూర్తి చేయనున్నారు. ఈ పథకం ద్వారా భూములపై క్లారిటీ రానుంది. గ్రామాల్లోని అనేక భూ వివాదాలకు ఫుల్ స్టాప్‌ పడనుంది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈ పనులు చేపడుతున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: