క‌రోనా విల‌య తాండ‌వం ఓ వైపు ప్రాణాల‌కు తెగించి ప‌నిచేసి తుది శ్వాస విడిచిన వారు ఇంకోవైపు. బాధాక‌ర సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వాలు కాస్త క‌రుణిస్తే చాలు బాధిత కుటుంబాల‌కో ఊర‌ట‌. ఏపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు క‌రుణ చూపించింది. ఆ వివ‌రాలివిగో....

ఏపీ ప్ర‌భుత్వం కరోనా బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. పండ‌గ వేళ శుభవార్త ఇచ్చింది. క‌రోనా విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అండ‌గా ఉండేందుకు నిర్ణ‌యించి మాన‌వ‌తా దృక్ప‌థాన్ని చాటుకుంది.ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామ‌కాలకు సంబంధించి ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ ఇప్పుడు ఓ శుభ సంకేతం ఇచ్చింది. క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబాల‌కు చెందిన వ్య‌క్తుల‌కు వారి విద్యార్హ‌త‌ను అనుస‌రించి పోస్టులు ఇచ్చేందుకు స‌మ్మ‌తించింది. కరోనా కార‌ణంగా రోడ్డున ప‌డ్డ కుటుంబాల‌కు ఈ నిర్ణ‌యం ఓ ఉప‌శ‌మ‌నం కానుంది.ఇప్ప‌టికే పోస్టుల భ‌ర్తీ కాక డైల‌మాలో ఉండిపోయిన అనేక బాధిత కుటుంబాల‌కు జ‌గ‌న‌న్న ఇచ్చిన కానుక‌గా పండ‌గ వేళ భావించ‌వ‌చ్చు.త్వ‌ర‌లోనే వీటికి సంబంధించిన ప్ర‌క్రియ కూడా మొద‌లుకానుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ముఖ్యంగా కరోనా విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్స్ కు ఈ నిర్ణ‌యం వ‌ర్తించ‌నుంది. అర్హ‌త‌ను అనుస‌రించి గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంట‌నే అమల్లోకి తేవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌నిర్దేశ‌కాలు అందించింది కూడా!

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp