ములాయంసింగ్ యాద‌వ్ కోడ‌లు అప‌ర్ణ‌యాద‌వ్  ఇవాళ అక‌స్మాత్తుగా బీజేపీలో చేరారు. ఈ త‌రుణంలో రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌తంత్ర దేవ్‌సింగ్, డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య లు కూడా  హాజ‌ర‌య్యారు. అప‌ర్ణ యాద‌వ్‌కు బీజేపీ కండువా క‌ప్పీ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. త‌రువాత అప‌ర్ణా యాద‌వ్ మీడియాతో ముచ్చ‌టించారు. తాను ముందు నుంచి బీజేపీ భావ‌జాలానికి ప్ర‌భావితురాలును అని పేర్కొన్నారు. ప్ర‌ధాని మోడీ, సీఎం యోగిఆదిత్య‌నాథ్, డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌ల‌తో స‌హా ఆఫీస్ బేర‌ర్‌లంద‌రికీ పేరుపేరున ధ‌న్య‌వాదాలు అంటూ ప్ర‌క‌టించారు. నా సామ‌ర్థ్యం ప్ర‌కారం.. ఏపని ఇచ్చినా తూచ త‌ప్ప‌కుండా చేస్తాను అని పేర్కొన్నారు.

అదేవిధంగా డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య మాట్లాడారు. అఖిలేష్ యాద‌వ్ త‌న సొంత ఇంట్లోనే విఫ‌లం చెందారు అని విమ‌ర్శించారు. ఇంత‌కు మించి ఏమి చెప్ప‌ద‌ల‌చుకోలేదు అని పేర్కొన్నారు. స‌మాజ్‌వాది పార్టీ మా ప‌థ‌కాల‌న్నింటిని క్రెడిట్‌గా తీసుకునే ప్ర‌య‌త్నించింద‌న్నారు. అభివృద్ధి చేశాన‌ని అఖిలేష్ యాద‌వ్ అంటున్నారు. వారు ఎంత అభివృద్ధి చేసారో.. వాళ్ల‌కు సేఫ్ సీటు దొర‌క్క ఇంత స‌మ‌యం ఎందుకు ప‌డుతుంద‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన త‌రువాత కూడా ఇంత స‌మ‌యం తీసుకుంటార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: