కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలను పోస్టాఫీసుల ద్వారా ఇంప్లిమెంట్ చేస్తుంటుంది. సాధారణ పౌరుడికి పొదుపు పథకాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది పోస్టాఫీసే. తక్కువ రిస్క్ తో కూడిన పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఇలా ఇప్పటికే ఎన్నో పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలను ప్రవేశపెట్టింది ఇండియన్ పోస్టాఫీస్. ప్రస్తుతం ఇందులో భాగంగా మరో పథకాన్ని ప్రారంభించారు. దాని పేరే ‘గ్రామ సురక్ష యోజన’ (Gram Suraksha Yojana). ఈ పథకం కింద నెలకు రూ.1500 డిపాజిట్ చేసినట్లయితే పెట్టుబడిదారుడికి రూ.35 లక్షల వరకు రిటర్న్ పొందుతాడు.

ఇండియన్ పోస్ట్ వెబ్ సైట్ ప్రకారం.. గ్రామ సురక్ష యోజన 19 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి గరిష్ట అర్హత పరిమితి 55 ఏళ్లు. ఈ పథకం కనీస విలువ రూ.10 వేల హామీ అందజేస్తుండగా.. పెట్టుబడి పెట్టేవారు రూ.10 లక్షల వరకు ఈ మొత్తాన్ని అయినా ఎంచుకోవచ్చు. 80 ఏళ్లు దాటిన తర్వాత, లేదా పెట్టుబడిదారుడు మరణించిన తర్వాత వారసుడు లేదా నామినీకి ఆ మొత్తం డబ్బుతోపాటు బోనస్ చెల్లిస్తారు.

పెట్టుబడిదారుడు ఈ ప్రీమియంను నెలవారీగా లేదా మూడు నెలలు, ఆరు నెలలు వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియం చెల్లించడానికి వినియోగదారుడికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పాలసీ వ్యవధిలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చందాదారుడు బకాయి ఉన్న ప్రీమియం చెల్లిస్తే.. బీమాను తిరిగి పునరుద్ధరించవచ్చు. అయితే ఒక వ్యక్తి తన 19 ఏళ్ల వయసులో ఈ పాలసీలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. అతని నెలవారీ ప్రీమియం 55 సంవత్సరాలకు రూ.1515., 58 ఏళ్లకు రూ.1,463., 60 ఏళ్లకు రూ.1,411., నెలకు చెల్లించాలి. అలా చెల్లిస్తే.. 55 ఏళ్ల బీమా కోసం మెచ్యూరిటీ ప్రయోజనం రూ. 31.60 లక్షలు వస్తుంది. అదే 58 ఏళ్ల పాలసీకి రూ.33.40 లక్షలు. 60 ఏళ్ల వరకు రూ.34.60 లక్షలు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: