స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా క‌స్ట‌మ‌ర్లు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. ఇష్యూల‌తో శ‌నివారం అన‌గా జ‌న‌వ‌రి 22, 2022 తాత్కాలికంగా ఎస్‌బీఐ డిజిట‌ల్ స‌ర్వీసులు ప‌ని చేయ‌వు అని ప్ర‌భుత్వ రంగం బ్యాంకు వెల్ల‌డించింది. శ‌నివారం బ్యాంకుకు చెందిన డిజిట‌ల్ స‌ర్వీసుల‌కు అంత‌రాయం క‌లుగ‌నున్న‌ద‌ని పేర్కొన్న‌ది.

 
బ్యాంకు అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్ ప్ర‌కారం.. ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, యోనో, యోనోలైట్‌, యూపీఐ వంటి స‌ర్వీసుల‌ను శ‌నివారం ఉద‌యం వాడుకోలేరు అని చెప్పింది. మెరుగైన బ్యాంకింగ్ స‌ర్వీసులు పొంద‌డానికి క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్న‌ట్టు ఎస్‌బీఐ ట్వీట్ పోస్ట్ చేసింది.

జ‌న‌వ‌రి 22న రాత్రి గంట‌ల స‌మ‌యం నుంచి ఉద‌యం 8.30 గంట‌ల వ‌ర‌కు టెక్నాల‌జీ అప్‌గ్రేడ్ చేస్తున్నందున స‌మ‌యంలో ఎస్‌బీఐ సేవ‌లు అయిన‌టువంటి ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ అందుబాటులో ఉండ‌వ‌ని ట్వీట్ చేసిన‌ది. గ‌తంలో కూడా డిసెంబ‌ర్ 11, 2021న మెయింట‌నెన్స్ ప‌నులను చేప‌ట్టింది ఎస్‌బీఐ.


మరింత సమాచారం తెలుసుకోండి: