కోవిడ్-19 తాజా వేరియంట్ తో అతలాకుతలం అవుతున్న ఆ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఏడుగురు మృతి చెందారు. మరో పదహేను మంది గాయపడినట్లుఅధికార వర్గాల కథనం. వాస్తవంగా ఈ అంకెలు పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఇది ఏ నగరంలోనో తెలుసా ?
ముంబైలోని 20 అంతస్తుల నివాస భవనంలో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఏడుగురు మరణించారు.
ముంబైలోని టార్డియో ప్రాంతంలోని గోవాలియా ట్యాంక్ వద్ద గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న కమ్లా భవనంలోని 18వ అంతస్తులో ఉదయం  మంటలు చెలరేగడంతో మరో 15 మంది గాయపడ్డారు.రసమాచారం అందుకున్నముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తదుపరి మీడీయాతో మాట్లాడుతూ ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్ అవసరమని, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. మంటలు "నియంత్రణలో ఉన్నాయి, కానీ పొగ భారీగా ఉంది. ప్రజలందరూ రక్షించబడ్డారు," అని ఆమె వివరించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజన్లు లతో పాటు ఏడు వాటర్ జెట్టీలు అగ్నిమాపక చర్యలో పాల్గొన్నాయని, దీనిని లెవల్-3 (ప్రధాన) అగ్నిప్రమాదంగా ట్యాగ్ చేశామని  కార్పోరేషన్ కు చెందిన ఉన్నతాధికారు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: