కోవిడ్-19 ఎవరినీ వదలడం లేదు.చిన్నా, చితకా వాళ్లతో పాటు సెలిబ్రటీలు, రాజకీయ నాయకులను కూడా అంటుకుంటోంది. ఇటీవల కరోనా బారిన పడిన రాజకీయ నాయకులలో పలువురు కేంద్ర మంత్రులున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా భారత దేశ మాజీ ప్రధానమంత్రిని కూడా కరోనా చుట్టుకుంది. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇంతకీ ఎవరా మాజీ ప్రధాన మంత్రి.?
"మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవగౌడ కరోనా బారి పడ్డారు. వైద్య పరీక్షలలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది" అని ఆయన కార్యాలయం ప్రకటించింది. సీనియర్ రాజకీయనేత, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప సామాజిక మాధ్యమాలలో  పోస్టు చేశారు.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దేవెగౌడ గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు.1994-96 వరకూ కర్ణాటక  ముఖ్యమంత్రిగా  పనిచేశారు. ఆ పై 1996-97 వరకూ భారత ప్రధాన మంత్రిగా భారత దేశానికి సేవలందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: