ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వై.ఎస్ భారతీ రెడ్డి కడప జిల్లా పులి వేందులలో పర్యటించారు. ఇది పూర్తిగా అనధికారిక పర్యటన. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తిగత పర్యటన కూడా. ఇంతకీ ఆమె ఎందుకు పులివెందులకు విచ్చేశారు ? అక్కడ ఏం చేశారు ? అన్న ప్రశ్నలు సహజంగానే మీడియా జనానికి వస్తాయి .
వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో దివంగత డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి నివాళులర్పించారు. సమీపంలోని అంధుల ఆశ్రమంలో  గంగిరెడ్డి అభిమానులు కేక్‌ కట్‌ చేసి దుస్తులు పంపిణీ చేశారు. వైఎస్ రాజారెడ్డి భవన్ వద్ద గంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ మనోహర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. ఇంతకీ డాక్టర్ గంగి రెడ్డి ఎవరో తెలుసా మీకు ? దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డికి వియ్యంకుడు. అంతేకాదు,  భారతీ రెడ్డికి స్వయాన  తండ్రి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ

మరింత సమాచారం తెలుసుకోండి: