ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ వైఖరిపై ఏదో ఒకరూపంలో నిరసన తెలుపుతోంది. ప్రజాసమస్యలపై పోరాటాలు ప్రారంభిస్తోంది. ఎలాగైనా ఏపీలో సత్తా చాటాలని ఆయన పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉద్యోగుల సమస్య హాట్ టాపిక్‌గా ఉంది. పీఆర్సీ విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.


ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. అందుకే..  నేడు బీజేపీ విజయవాడలో ఒక్కరోజు నిరసన దీక్ష చేపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలకు సంఘీభావంగా ఈ నిరసన దీక్ష ఉంటుంది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు సోము వీర్రాజు దీక్షలో పాల్గొంటారు. దీక్షలో ఆయనతో పాటు ఎంపీలు సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్సీలు మాధవ్‌, నారాయణరెడ్డి
కూడా పాల్గొననున్నారు.  ప్రజా పోరాటాల ద్వారా తన విస్తృతి పెంచుకునేందుకు బీజేపీ ఇలా ప్రయత్నిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp