ఇవాళ దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరగబోతోంది. రాష్ట్రపతి గౌరవ వందనంతో ప్రారంభమయ్యే ఈ పరేడ్‌ దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా నిర్వహించబోతున్నారు. ఈ పరేడ్‌లో 16 కవాతు విభాగాలు పాల్గొనబోతున్నాయి.


ఈ పరేడ్‌లో 75 విమానాలతో వాయుసేన విన్యాసాలు నిర్వహించబోతోంది. ఈ విన్యాసాల్లో రఫేల్‌, సుఖోయ్‌, జాగ్వార్‌, అపాచీ యుద్ధ విమానాలు పాల్గొనబోతున్నాయి. ఈ కవాతులో 9 శాఖలు పాల్గొంటాయి. ఆ తర్వాత 12 రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శన అలరించబోతోంది. అయితే.. ఈ సారి కవాతులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శకటాలకు స్థానం దక్కలేదు. కొవిడ్‌ దృష్ట్యా పరేడ్‌కు పరిమిత సంఖ్యలోనే సందర్శకులకు అనుమతిస్తున్నారు.
రెండు టీకా డోసులు తీసుకున్నవారికే ఈ పరేడ్‌కు అనుమతి ఇస్తున్నారు. అలాగే ఒక డోసు తీసుకున్న బాలలకు పరేడ్‌కు అనుమతిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: