సుందర్ పిచాయ్.. భారత మూలాలున్న టెకీ.. ఏకంగా గూగుల్‌ సీఈవో స్థాయికి ఎదిగాడు.. దక్షిణ భారతంలోని చెన్నెకు చెందిన సుందర్ పిచాయ్.. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకునే సీఈవోల్లో ఒకరు. భారత యువతకు అతడిని ఆదర్శంగా చూపించేందుకు.. దేశం ఇటీవల అతనికి పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించింది.


అయితే.. పద్మభూషణ్‌ వచ్చిన మరుసటి రోజే సుందర్‌ పిచాయ్‌పై ముంబయిలో కేసు నమోదు కావడం విశేషం. కాపీరైట్‌ చట్టం ఉల్లంఘన కింద గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ దర్శకుడు సునీల్‌ దర్శన్‌ ఫిర్యాదు మేరకు సుందర్ పిచాయ్‌ పై  కేసు నమోదు చేశారు. తన చిత్రాన్ని తన అనుమతి లేకుండా అప్‌లోడ్‌ చేసేందుకు గూగుల్‌ యత్నించిందని ఈ ఫిర్యాదు సారాంశం. 'ఏక్‌ హసీనా థీ ఏక్‌ దీవానా థా' చిత్రం అప్‌లోడ్‌కు గూగుల్ అనుమతి ఇచ్చిందని.. ఇది నిబంధనలకు వ్యతిరేకం అని ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌ నుంచి చిత్రం అప్‌లోడ్‌ చేసినట్టు దర్శకుడు సునీల్ దర్శన్‌ చెబుతున్నారు. ఈ అంశంపై కోర్టు ఆదేశాలతో సుందర్‌ పిచాయ్‌తో పాటు ఐదుగురు గూగుల్‌ అధికారులపై కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: