ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ప్రభాస్ హవా చాలా ఎక్కువగా నడుస్తుంది. రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ ఇంకా అలాగే ప్రాజెక్ట్ కే...ఇలా అన్నీ కూడా భారీ సినిమాలే. వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలే. రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధం కాగా... ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయింది. సలార్ ఇంకా ప్రాజెక్ట్ కేల షూటింగ్ సమాంతరంగా నడుస్తుంది.ఇప్పుడు ఆది పురుష్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అందించనున్నట్లు సినిమా దర్శకుడు ఓం రౌత్ సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. రేపు (మార్చి 1వ తేదీ) ఉదయం 7:11 గంటలకు ఆదిపురుష్ సినిమాకి సంబంధించి అప్‌డేట్ రానుంది.

ఇక ఈ సినిమా 2022 ఆగస్టు 11వ తేదీన విడుదల కావాల్సి ఉండగా...బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా కోసం వాయిదా వేశారు.కాబట్టి రేపు ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ముందుగానే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. క్లాష్ అవ్వకుండా భారీ సినిమాలన్నీ ముందే డేట్లు అనేవి బ్లాక్ చేసుకుంటున్నాయి. 2023లో డేట్లు బ్లాక్ చేసిన భారీ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: