చైనా దేశంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్‌ 737 విమానంలో ప్రయాణం చేస్తున్న 133 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైనట్టు సమాచారం తెలుస్తుంది.దక్షిణ చైనా గ్వాంగ్‌జీ జియాంగ్‌ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో ఆ విమానం కుప్పకూలింది. మంటలు చెలరేగి విమానం కుప్పకూలినట్టు అక్కడి ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. కన్‌మింగ్‌ నుంచి గ్వాంగ్‌జాంగ్‌ ప్రాంతానికి విమానం వెళ్తున్న సమయంలో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. 

ఇక ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.ఇక ఈ ప్రమాదంలో మృతులు ఇంకా అలాగే క్షతగాత్రులపై ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ ప్రమాద తీవ్రతను బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని అక్కడి స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.ఇక ఇలానే గతంలో కూడా 2010లో చైనాలోని యిచున్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలిన ఘటనలో 42 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: