కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లోప్రవేశాలకు సంబంధించి కేంద్రం ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాల్లో ఎంపీల కోటా సీట్లు ఇక ముందు ఉండవు.. వాటిని కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటిదాకా కేంద్రీయ విద్యాలయాల్లో ఏటా ఒక్కో ఎంపీకి 10సీట్ల వరకు కోటా ఇస్తున్నారు. అంతే కాదు.. కొంతకాలంగా ఈ కోటా సీట్లు పెంచాలన్న డిమాండ్ కూడా ఎంపీలు చేసేవారు. కానీ ఇప్పడు కేంద్రం ఏకంగా ఉన్న కోటాను కూడా కట్ చేసేసింది. కేంద్రం తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీలే కాదు.. ఇతర కోటాలను కూడా కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రద్దు చేసేసింది. ఇప్పటికే మోదీ సర్కారు విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వాటిలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: