ఏపీ ప్రభుత్వం మరికొందరికి శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకూ అనేక నిబంధనల కారణంగా అమ్మఒడి అందుకోలేకపోయినా వారిలో చాలా మందికి శుభవార్త చెప్పింది. నిబంధనలు సడలించడం ద్వారా మరింత ఎక్కువ మందికి అమ్మఒడి అందబోతోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకంలో అర్హులు కారు. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింప చేశారు. అలాగే గతంలో నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారు అర్హులు కారు. కానీ ఇప్పుడు దాన్ని కూడా సవరించి టాక్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా అవకాశం  కల్పించారు. గతంలో పట్టణాల్లో 700 చదరపు అడుగులు, ఆ లోపు ఇల్లున్న వారే అర్హులు. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా అమ్మ ఒడి ఇస్తున్నారు. ఈ చర్యల ద్వారా  ఇంకా ఎక్కువ మందికి అమ్మ ఒడి పథకం దక్కే అవకాశం ప్రభుత్వం కల్పించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: