ఇండియా చైనాకు బిగ్‌ షాక్ ఇచ్చింది. చైనా పౌరులకు పర్యాటక వీసాలు రద్దు చేస్తూ ఇండియా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం తన సభ్య విమానయాన సంస్థలకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది. ఈనెల 20న భారత విదేశాంగశాఖ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఇకపై పదేళ్ల కాలానికి చైనా పౌరులకు జారీ చేసిన పర్యాటక వీసాలు ఇకనుంచి పని చేయవని ఐఏటీఏ తెలిపింది. అయితే. ఇండియా ఇంత సడన్‌గా ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఇంది. భారత విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న చైనాకు భారత్‌ ఇలా షాక్‌ ఇచ్చింది.  చైనా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న 25వేల మంది భారత విద్యార్థులను చైనా తరగతులకు అనుమతివ్వట్లేదు. అందుకే ఇండియా చైనాకు షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో కరోనా వల్ల చైనాలో విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులు స్వస్థలాలకు వచ్చారు. చైనా ఇప్పటి వరకు కూడా వారు తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వటంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: