మాజీ హీరోయిన్, అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు బెయిల్ రాలేదు. ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాకు కూడా బెయిల్ రాలేదు. భిన్నవర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టిస్తున్నారనే అభియోగాలపై వీరిద్దరూ అరెస్టయిన సంగతి తెలిసిందే. అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మహారాష్ట్ర  సీఎం ఇంటి ముందు. హనుమాన్ చాలీసా పఠిస్తామన్న రాణా దంపతుల సవాల్‌తో వీరిద్దరూ ముంబయిలో ఉద్రిక్తతలకు కారణమయ్యారని అభియోగాలు ఉన్నాయి. అయితే.. రాణా దంపతుల నివాసం ఎదుట శివసేన కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఆ తర్వాత సవాల్ నుంచి రాణా దంపతులు వెనక్కి తగ్గారు. కానీ భిన్నవర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు యత్నించడం సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్గించారనే కారణంతో వీరిద్దరినీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు బాంద్రా కోర్టులో హాజరుపరిచిన ముంబయి పోలీసులు పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలని అడిగినా కోర్టు ఇవ్వలేదు. నవనీత్ రాణాను బైకుల్లాలోని మహిళల జైలుకు, రవిరాణాను ఆర్థర్‌రోడ్డులోని కారాగారానికి తరలించారు. నవనీత్‌ కౌర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన కోర్టు అందుకు నిరాకరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: