టెక్నాలజీలో ఎంతో ముందుడే చైనా మరో ఘనత సాధించింది. తాజాగా చైనా రెండు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వాయవ్య చైనాలోని జియు క్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి ఈ రెండు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. వీటి పేర్లు  సీవీ 1, 2 ఉపగ్రహాలు. వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. లాంగ్ మార్చ్ 2సీ రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని చైనా తెలిపింది.


ఈ ఉపగ్రహాలతో భూ వనరుల సర్వే మరింత మెరుగవుతుందట. అలాగే పంట దిగుబడి అంచనాతో పాటు విపత్తుల నియంత్రణ, సముద్ర పరిరక్షణ మరింత బెటర్ అవుతుందట. అలాగే భద్రత, డిజిటల్ గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం చేపట్టారని తెలుస్తోంది. లాంగ్ మార్చ్ రాకెట్ మిషన్ సిరీస్ లో ఇది చైనాకు  417 వ ప్రయోగం. అంటే ఆలోచించుకోండి చైనా ఎంత ముందుందో. ఇటీవల మన ఇండియా కూడా స్పేస్ రంగంలో కుమ్మేస్తోందనుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: