ఆ మధ్య కరోనా తర్వాత చదువు కోసం చైనా వెళ్లిన ఇండియన్లకు ఆ దేశం చుక్కలు చూపించింది. వారిని వర్శిటీల్లోకి అనుమతించలేదు. దీంతో ఇండియా చైనాపై సీరియస్ అయ్యింది. చైనాలోని టూరిస్టు వీసాలను ప్రత్యేక వీసాల గడువును కుదించేసింది. దీంతో ఇప్పుడు చైనా దారికి వచ్చింది. కరోనా కారణంగా విధించిన వీసా, విమాన నిబంధనలతో రెండేళ్లుగా స్వదేశంలో చిక్కుకునిచదువు కోసం తమ దేశానికి రావాలనుకునే భారతీయ విద్యార్థుల్లో కొందరిని అనుమతిస్తామని చైనా తాజాగా ప్రకటించింది.

చైనా రావాలనుకునే భారతీయ విద్యార్థుల ఆందోళనలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చైనా ఇప్పుడు నీతులు చెబుతోంది. వారి రాకకు అవసరమైన నియమ నిబంధనలు, తమ దేశానికి వస్తున్న ఇతర దేశాల విద్యార్థుల అనుభవాల గురించి భారత ప్రభుత్వంతో చర్చించినట్లు చైనా చెబుతోంది. భారతీయ విద్యార్థులను అనుమతించడంపై పని ప్రారంభమైందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.చైనాలో చదువుకునే విద్యార్థుల జాబితాను భారత్ అందిస్తే.. అందుకు ఏర్పాట్లు చేస్తామంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: