హమ్మయ్య.. చైనా ఊపిరి పీల్చుకుంటోంది. ఎందుకో తెలుసా.. కొవిడ్ కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గడంతో హాంగ్‌కాంగ్, చైనా ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అందుకే అక్కడ క్రమంగా కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తితో గతంలోనే హాంగ్‌ కాంగ్ ప్రభుత్వం స్మిమ్మింగ్ పూల్‌లు, బీచ్‌లను మూసివేసింది. ఇప్పుడు కాస్త కేసులు తగ్గడంతో ఆంక్షలను సడలించింది.  బీచ్‌లను, స్విమ్మింగ్ పూల్‌లను తెరిచింది.  రెస్టారెంట్లలోనూ ఆంక్షలు ఎత్తేస్తోంది. టేబుల్‌కు ఎనిమిది మంది కూర్చోవచ్చని రూల్స్ మార్చింది. అటు చైనా రాజధాని బీజింగ్‌లో సైతం విదేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనలు తగ్గించారు. గతంలో విదేశాల నుంచి బీజింగ్‌కు వచ్చేవారికి గతంలో 14 రోజులపాటు హోటల్‌లో మరో ఏడురోజులు హోం ఐసోలేషన్‌లో ఉండేలాక్వారంటైన్ విధించేవారు. ఇప్పుడు ఈ నిబంధనను సడలించిన అధికారులు.. హోటల్‌లో పదిరోజులు, హోం ఐసోలేషన్‌లో వారం రోజులు ఉంటే చాలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: