రైల్వేశాఖ ఇండియాలోనే అతి పెద్ద రవాణా సంస్థ ఇది. దేశంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థ కూడా. ఇది ఎప్పటికప్పుడు తన సేవలను మెరుగుపరచుకుంటోంది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఉత్తర రైల్వే డివిజన్ అమ్మల కోసం ఓ కొత్త సౌకర్యం అందిస్తోంది. చిన్నపిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం మడిచే బేబీ బెర్త్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.


ఈ మడిచే బెర్త్‌పై చిన్న పిల్లలు పడుకోవచ్చు. సాధారణంగా ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ పడుకోవడానికి ఇబ్బంది ఉంటోంది. అందుకే రైల్వేశాఖ వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ ఫోల్డబుల్ బెర్త్ ను యర్‌ బెర్త్‌కు అటాట్‌ చేస్తారు. తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఇది లక్నో మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఇతర రైళ్లలోనూ ప్రవేశ పెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: