కరోనాను ఇప్పుడు అంతా లైట్‌గా తీసుకుంటున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. అయితే.. ఇండియాలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలపై తాజాగా ఐఐటీ కాన్పూర్ ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం దేశంలో నాలుగో వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. దీనికి సంబంధించి  రెండు కారణాలను ఐఐటీ కాన్పూర్‌ చెబుతోంది. రెండేళ్ల కాలంలో కరోనా వైరస్ సోకింది కదా. ఇలా పెద్ద సంఖ్యలో ప్రజలకు సహజ రోగనిరోధక శక్తి లభించిందట.

అలాగే 90 శాతం మంది భారతీయులకు ఈ సహజ నిరోధకత ఉందట. ఇది వైరస్ నుంచి బలమైన రక్షణను ఇస్తుందని ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు చెబున్నారు. ఇక జీనోమ్ సీక్వెన్సింగ్‌లో చెప్పుకోదగ్గ విధంగా వైరస్‌ ఉత్పరివర్తనాలు లేవని కూడా ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు  చెబుతున్నారు. దిల్లీలోని కొవిడ్ పాజిటివ్‌ నమూనాల సీక్వెన్సింగ్‌లోనూ ఎలాంటి కొత్త ఉత్పరివర్తలు వెలుగులోకి రాలేదట. కొవిడ్ ఆంక్షలన్నింటినీ  ఎత్తివేయడం వల్లే కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: