వైసీపీ సర్కారు ఇప్పటికే అనేక మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టింది. వారిని జైల్లో పెట్టించింది. వారు ఆ తర్వాత బెయిల్ పై వచ్చేశారనుకోండి.. తాజాగా మాజీ మంత్రి నారాయణను కూడా అరెస్టు చేశారు. ఆయన కూడా వెంటనే బెయిల్ పై బయటకు వచ్చేశారు. అయితే.. ఇలాంటి నాయకులను కాదు.. దమ్ముంటే మా చంద్రబాబును టచ్ చేయి చూద్దామంటూ జగన్‌కు సవాల్ విసురుతున్నారు విజయవాడ టీడపీ నేత జలీల్ ఖాన్.


మంత్రి బొత్సాకు విద్యా శాఖ అంటే ఇష్టం లేదని.. అందుకే ప్రమాణ స్వీకారం రోజు అయిష్టంగా వెళ్ళాడని టీడీపీ నేత జలీల్ ఖాన్‌ అంటున్నారు. పేపర్ లీక్ అయితే మంత్రి రాజీనామా చేయాలి...లేదా సీఎం రాజీనామా చేయాలని.. బాదుడే బాదుడు కి వస్తున్న ఆదరణ చూసి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత జలీల్ ఖాన్‌ ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్ ఫోటో కాదని... ప్రశాంత్ కిషోర్ ఫొటోతో గెలిచిందంటున్న టీడీపీ నేత జలీల్ ఖాన్‌.. గాలికి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గాలిలోనే పోతారంటున్నారు. జగన్ కు దమ్ముంటే చంద్రబాబును టచ్ చేయాలని.. అప్పుడు రాష్ట్రం ఏమి అవుతుందో చూపిస్తామని టీడీపీ నేత జలీల్ ఖాన్‌ సవాల్ విసురుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: