తెలంగాణలో ఇటీవల వెలుగు చూసిన ఓ స్కామ్ మూలాలు ఆంధ్రాలో బయటపడ్డాయి. తెలంగాణ ప్రాంతంలో వెలుగు చూసిన నకిలీ ఎరువుల కుంభకోణంపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేయగా దీని మూలాలు ఏపీలో వెలుగు చూశాయి. సత్తుపల్లి పరిసరాల్లో ఇటీవల కల్తీ పొటాష్ వ్యవహారం కలకలం రేపింది. ఇసుక రంగు మార్చి పొటాష్ గా తెలంగాణలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రైతుల ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా  ఏపీకి తెలంగాణ అధికారుల బృందం వెళ్లింది. విజయవాడ నగర శివారు నున్నలోని  ఆగ్రో పరిశ్రమలను,గోదాములను తెలంగాణ పోలీసులు పరిశీలించారు. తెలంగాణ పోలీసులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ గోదాములను పరిశీలించారు. పరిశ్రమ నిర్వాహకుల నుంచి పూర్తి వివరాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారు. ఇలా సరిహద్దులు దాటిస్తూ ఏపీలోని కొందరు మోసగాళ్లు చేస్తున్న బండారాన్ని తెలంగాణ పోలీసులు బయటపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: