కలెక్టర్ చొరవతో ఏపీలో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్ష రాయగలిగారు. తుఫాను కారణంగా వాగులు ఉప్పొంగడంతో పరీక్ష కేంద్రం  చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర బాబు ఆదుకున్నారు. ఆయన త్యేక చొరవతో  సజావుగా పరీక్షలు రాశారు.  కలిగిరి మండలం సిద్ధన కొండూరు గ్రామానికి చెందిన 8 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కావలి పరీక్షా కేంద్రంలో  పరీక్షలు రాయడానికి బయల్దేరారు. వారు మార్గ మధ్యలో పలు చిన్న వాగులు దాటుకుంటూ ఉధృతంగా ప్రవహిస్తున్న పరికోట వాగు దాటలేక చిక్కుకుపోయారు.  


ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్  చక్రధర బాబు వెంటనే స్పందించి ఎలాగైనా సరే వారు వాగు దాటి పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.  సమయాభావం వల్ల వారు కావలికి చేరుకోలేని పరిస్థితి ఉండటంతో జిల్లా కలెక్టర్ ఇంటర్మీడియట్ శాఖ కార్యదర్శి  ఎంవి శేషగిరిబాబుకు ఈ విషయం తెలియజేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: