విశాఖ లో ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టింది. విశాఖలో ఈ ఫెడరేషన్‌ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ పేరిట స్వచ్చంద సేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  విశాఖ నగరం లో వివిధ ప్రాంతాల్లో 20 ఫ్రిడ్జ్ లు ఏర్పాటు చేశారు. పేదవారు ఉచితంగా ఆహారం తీసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసారు. ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ ,మరియు విశాఖ లో వాణిజ్య వర్తక వ్యాపారులు సంయుక్తంగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో వినూత్న ఔదార్యానికి శ్రీకారం చుట్టిన కార్యక్రమంగా దీనిని అభివర్ణిస్తున్నారు.


ఎంత సంపద ఎంత ఉన్న పేదవాళ్లకు అన్నంపెట్టాలి పది మందికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ వినూత్న స్వచ్చంద సేవ చేస్తున్నారు. ఈ సేవ చేసిన ఇంటర్నేషనల్  వైశ్య ఫెడరేషన్ ను మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా అభినందించారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ లను ప్రారంభించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: