కేరళలో వర్ధమాన నటి, మోడల్‌ షహనా అనుమానాస్పద మృతి మిస్టరీ ఇంకా వీడలేదు.  కేరళలోని కాసరగోడ్‌కు చెందిన 20 ఏళ్ల షహనాకు సజ్జద్ అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది. కోజికోడ్‌కు 14కిలోమీటర్ల దూరంలోని పరాంబిల్ బజార్‌లో వారిద్దరూ కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు. గత గురువారం రాత్రి వారు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని కిటికీ ఊచలకు షహనా మృతదేహం వేలాడుతూ కనిపించింది. చీరలు, ఆభరణాల యాడ్‌లతో కేరళ వాసులకు షహనా సుపరిచితురాలు. నటిగా స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఈ హత్య అభిమానులను హతాశయులను చేసింది.


షహనా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యేనని వారు ఆరోపించారు. షహనాను  భర్త ఎప్పుడూ తనను హింసించేవాడని షహనా చెప్పేదన్న ఆమె తల్లి చెబుతోంది. షహనా ఆత్మహత్య చేసుకునే రకం  కాదంటున్నారు. అయితే.. షహనా భర్త సజ్జద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నా ఇప్పటి వరకూ కేసులో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: