తెలంగాణలో కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. ఈ-శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకున్న కార్మికుల వివరాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికుల వేతనాలు దారుణంగా ఉంటున్నాయి. వారు చాలీచాలని సంపాదనతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. రోజువారీ వ్యవసాయ కూలీలుగా, ఇంటిపనివారుగా, వీధి వ్యాపారులుగా, నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తున్నవాళ్ల జీతాలు ఏమాత్రం పెరగడం లేదట. కొవిడ్‌ కారణంగా అసంఘటిత కార్మికుల ఉపాధి దెబ్బతిన్నది. తెలంగాణలో దాదాపు 87 శాతం మంది నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదించడం లేదట. మొత్తం కార్మికుల్లో  కేవలం 2.5 శాతం మంది మాత్రమే రూ.15 వేలకు పైగా ఆర్జిస్తున్నారని ఈ శ్రమ్‌ పోర్టర్‌లో నమోదు అయిన వివరాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈ-శ్రమ్‌లో ఇప్పటి వరకూ 36.19 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అసంఘటిత రంగ కార్మికులను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను తీసుకువచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: