తెలంగాణలో కొన్ని లక్షల మంది వివిధ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. వీరు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ లో నమోదు చేసుకుంటున్నారు. ఇలా నమోదు చేసుకున్న కార్మికులకు రూ.2 లక్షల బీమా, సామాజిక భద్రత పథకాలు వర్తిస్తాయి. ఈ పోర్టల్‌లో ఇప్పటివరకు తెలంగాణలో 36.19 లక్షల మంది పేర్లు నమోదు చేశారు. ఉపాధి హామీ కూలీలను కూడా  ఈ శ్రమ్  కింద నమోదు చేయాలని కేంద్రం సూచించింది. అలా చేస్తే తెలంగాణ అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య కోటికిపైగా ఉంటుంది.


అయితే.. తెలంగాణలోని అసంఘటిత రంగ కార్మికుల్లో స్త్రీలు 49.01 శాతంగా ఉన్నారు.  పురుషులు 50.98 శాతంగా ఉన్నారు. అంటే దాదాపు సమానం. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో ఓబీసీ కులాల వారే.. అంటే వెనుకబడిన తరగతుల వారే ఎక్కువ. వీరు మొత్తం శ్రామికుల్లో 51.58 శాతం మంది ఉన్నారు. ఇక శ్రామికుల్లో ఎస్సీలు 20.23 శాతం.. ఎస్టీలు 12.12 శాతంగా ఉన్నారని ఈ శ్రమ్ పోర్టల్ చెబుతోంది. అలాగే కార్మికుల్లో 40 ఏళ్లలోపు వారే సగానికిపైగా ఉన్నారని ఈ పోర్టల్ ద్వారా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: