ఆర్‌. కృష్ణయ్య.. బీసీ సంఘం నేతగా దశాబ్దాల తరబడి ఆయన తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు. జీవితాంతం బీసీల కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే ఆయన క్రియాశీల రాజకీయాల్లో పెద్దగా ఉన్నదేమీ లేదు. కానీ ఆయన్ను రాజకీయ పరంగా అదృష్టం తరచూ వరిస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎల్బీనగర్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయన్ను తెలుగు దేశం తరపున సీఎం అభ్యర్థి అని కూడా ప్రకటించింది. రాష్ట్రం అప్పటికే విడిపోయినా ఆయన తెలుగు దేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వెంటనే ఆయన టీడీపీకి దూరం అయ్యారు.


టీఆర్ఎస్‌తో సత్సబంధాలు కొనసాగించారు. ఆ తరవాత ఆ పార్టీకి కూడా దూరం అయ్యారు. ఇక 2018లో మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. కానీ ఆయన ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఆయన ఏ పార్టీలోనూ లేకపోయినా.. వైసీపీ అధినేత జగన్ పిలిచి మరీ రాజ్యసభ సీటు కట్టబెట్టారు. అందుకే అబ్బా.. అదృష్టం అంటే ఆర్‌.కృష్ణయ్యదే అనుకుంటున్నారు రాజకీయ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: