వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. తెలంగాణ వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో అనేక నామినేటెడ్ పదవులను తెలంగాణవారికి సీఎం జగన్ కట్టబెట్టారని విమర్శలు ఉన్నాయి. దేవులపల్లి అమర్ వంటి తెలంగాణ వారికి ఏపీలో సలహాదారుల పదవులు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా పార్టీ రాజ్యసభ సీట్లలో రెండింటిని తెలంగాణ వారికి కట్టబెట్టడం చర్చనీయాంశం అవుతోంది.

బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యతో పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డికి సీఎం జగన్ రాజ్యసభ అభ్యర్థులుగా పార్టీ తరపున అవకాశం ఇచ్చారు. ఆర్‌ కృష్ణయ్య తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాకు చెందిన బీసీ నేత కాగా.. నిరంజన్ రెడ్డి తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది. ఉన్న నాలుగు సీట్లలో రెండు తెలంగాణ వారికి ఇవ్వడం పార్టీలోనూ చర్చనీయాంశం అవుతోంది. అయితే.. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్నాకనే ఈ పదవుల పంపకం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: