ఏపీ సీఎం జగన్ తెలంగాణ వారికి రెండు రాజ్య సభ స్థానాలు ఇవ్వడం రాజకీయంగా వివాదంగా మారుతోంది. రాజ్యసభ సీట్లు ఇచ్చేందుకు ఏపీలో సమర్థులు లేరా అని ముఖ్యమంత్రి జగన్ ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్నవారికి జగన్ రాజ్యసభ సీట్లు ఇచ్చారని చంద్రబాబు ఆక్షేపించారు. కడపలో జిల్లాస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన... జగన్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.


పులివెందులలో బస్టాండ్ కట్టలేని వాళ్లు 3 రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు జగన్‌ ను నిలదీశారు. పులివెందులలో రైతులకు బీమా ఎందుకు రావడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాలు చంద్రబాబు మాట్లాడారు. అవన్నీ ఓకే.. కానీ.. గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చేసిన విషయం మాత్రం మరచిపోతున్నారు. 2014లో తెలంగాణకు చెందిన గరికిపాటి మోహన రావుకు ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: