పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివ లింగం ఒకటి బయటపడింది.  పోలవరం మండలం సింగన్నపల్లిలో ఈ శివలింగం వెలుగు చూసింది. కొంతకాలంగా ఇక్కడ  అప్రోచ్ ఛానల్ పనులు కొనసాగుతున్నాయి.  సింగంపల్లి శివారులో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. యంత్రాల సాయంతో  మట్టిని తీస్తున్న సమయంలో శివ లింగం బయట పడింది. కార్మికులు తవ్వకాలు నిలిపి శివలింగాన్ని బయటకు తీసుకొచ్చారు.


ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు కొందరు అక్కడికి వెళ్లి శివలింగాన్ని పరిశీలించారు. శివలింగం పూర్తిగా మట్టితో నిండి ఉంది. దీన్ని శుభ్రం చేశారు. తవ్వకాల వల్ల శివ లింగం కాస్త బీటలు వారింది. గతంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో పలు చోట్ల శివాలయాలు ఉండేవి. వరదల వల్ల అవి కనుమరుగు అయ్యాయి. అలాంటి వాటిలో నుంచే ఈ లింగం ఉండి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. పోలవరం పనుల్లో శివ లింగం బయటపడటం శుభ శకునంగా భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: