శ్రీలంకను తెలివిగా అప్పుల ఊబిలో దింపిన చైనా.. ఆ దేశాన్ని క్రమంగా ఆక్రమించుకునే ప్రమాదం ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. శ్రీలంక గతంలో చైనాకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. మొదట్లో తమ సొంత ఓడరేవు హంబన్ టోటాను చైనాకు లీజుకు ఇచ్చి రుణాలు తీసుకుంది. చైనా అభివృద్ధి చేసి ఇస్తుంది కదా అని ఆశపడింది. పైగా చైనా నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది శ్రీలంక. అలాంటి శ్రీలంక క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడు కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.


ఇలా ఒక్క ఆ ఓడరేవే కాదు..  అలా శ్రీలంకకు చెందిన ప్రధానమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చైనాకు తాకట్టు పెట్టింది. ఇప్పుడు కీలక ప్రాజెక్టులు చైనాకే ధారాదత్తం అయిపోయాయి. ఇక  ఎల్‌టీటీఈతో శ్రీలంక ప్రభుత్వం చేసిన యుద్ధం ఆ దేశానికి నష్టదాయకంగా మారింది.  విదేశీ మారక నిల్వలను కాపాడుకోలేకపోయింది. ఈ తప్పులతో ఇప్పుడు క్రమంగా చైనా శ్రీలంకపై పట్టు సాధించే పరిస్థితి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: