కాలం మారుతోంది. కాలంతో పాటే చదువులూ మారాలి. కొత్త టెక్నాలజీలు కొత్త ఉద్యోగాలకు అవకాశం ఇస్తున్నాయి.  డేటాబేస్‌. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వంటి అంశాల్లో నైపుణ్యత సాధిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొత్త సాంకేతికతను నేర్చుకునేందుకు కొత్త తరం విద్యార్థులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.  వీటిని నిరంతర సాధన, కృషి ద్వారా అనుకున్న లక్ష్యాన్ని విద్యార్థులు  చేరుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐవోటీ, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ లాంటి నూతన సాంకేతిక అంశాలను విద్యార్థులు నేర్చుకోవాలి. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను జయించాలంటే విద్య ఒక్కటే మార్గం. అలాగే మంచి వ్యక్తిత్వం, సహనం, పట్టుదల, కష్టపడేతత్వం ఉంటే విద్యార్థులు జీవితంలో స్థిరపడటం అంత కష్టమేమీ కాదు. అలాగే విద్యార్థులు ఉద్యోగాలకే పరిమితం కాకూడదు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి.. నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: