తెలంగాణలో ఈ రోజు కొన్నిచోట్ల, రేపు అక్కడక్కడ  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో   కూడిన వర్షములు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో  వచ్చే అవకాశం ఉంది . ఈరోజు  కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణా రాష్ట్రంలో  రాగల మూడు రోజుల  వరకు వాతావరణ విశ్లేషణ  మరియు వాతావరణ  హెచ్చరికలను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం  జారీ చేసింది. నిన్నటి ఉపరితల ఆవర్తనము ఇప్పుడు రాయలసీమ & పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉండి ఎత్తుకు వెళ్లేకొద్దీ పశ్చిమ దిక్కుకు వాలి వుంది. తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక మీద ఉన్న ఉపరితల  ఆవర్తనము ఈరోజు బలహీనపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: