మూడు నెలలుగా సాగుతున్న రష్యా -ఉక్రెయిన్  యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యాకు ఈ యుద్ధంలో భారీ విజయం దక్కింది. మాస్కో బలగాలు  వ్యూహాత్మక ప్రాంతమైన మరియుపోల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు రష్యా ఓ ప్రకటన చేసింది. మరియుపోల్ లోని కీలకమైన అజోవ్ స్తల్  ఉక్కు కర్మాగారాన్ని మాస్కో సేనలు పూర్తిగా అధీనంలోకి తెచ్చుకుంది. దీంతో మరియుపోల్  పూర్తిగా రష్యా హస్తగతమైంది.


మరియుపోల్ ను పూర్తిగా హస్తగతం చేసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. మరియుపోల్ లో.... రెండున్నర వేల మంది ఉక్రెయిన్  సైనికులు రష్యా ముందు లొంగిపోయారు. వీరిని యుద్ధ ఖైదీలుగా రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాయి. అయితే.. రష్యా ప్రకటనపై ఉక్రెయిన్‌ మాత్రం మౌనం వహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: