చైనాలో ఉన్న యాపిల్ తయారీ సంస్థలకు ఆ సంస్థ ఇండియాకు తరలించబోతోందా.. చైనాలోని కరోనా కఠిన నిబంధనలు ఇండియాకు వరంగా మారబోతున్నాయా.. ఇండియాకు ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ రాబోతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును.. చైనాలో ఇటీవల కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా యాపిల్‌ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. డెడ్ లైన్లు అందుకోవడం ఆ సంస్థకు ఇబ్బందిగా మారింది. అందుకే యాపిల్ సంస్థ తమ ఉత్పత్తుల తయారీని చైనా నుంచి ఇండియాకు మార్చాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్ ఓ స్టోరీ రాసేసింది.


యాపిల్ సంస్థ చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌, వియత్నాంపై దృష్టి సారించిందట. యాపిల్ సంగతి తెలుసు కదా.. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీ. అలాంటి సంస్థ ఇండియాకు వస్తే.. అది ఇతర ఎంఎన్‌సీ కంపెనీలపైనా తీవ్ర ప్రభావం చూపొచ్చు. చైనా నుంచి బయటకి వచ్చే కంపెనీలు భారత్‌ వైపే చూడొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: