ఇండియా చైనా మధ్య ఘర్షణ వాతావరణం ఈనాటిది కాదు.. రెండు, మూడేళ్లుగా సరిహద్దుల్లో ఇదే వాతావరణం ఉంది. ఇప్పుడు ఇది మరో దేశానికి వరంగా మారబోతోందా అనిపిస్తోంది. ఇంతకీ ఆ దేశం ఏంటి అంటారా.. అదే వియత్నాం. అవును.. చైనాలో లాక్‌డౌన్ల నేపథ్యంలో పలు కంపెనీలు చైనాను వీడిపోవాలని భావిస్తున్నాయి. అలాంటి కంపెనీలకు సహజంగా ఇండియా ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అయితే.. చైనా నుంచి ఇండియాకు వెళ్తే.. చైనాకు ఎక్కడ కోపం వస్తుందో అన్న ఆందోళన ఆ కంపెనీల్లో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఇండియా బదులుగా వియత్నాం వారికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.

చైనాలో తయారీ ఉన్న సంస్థలు భారత్‌కు బదులు వియత్నాంను ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గల్వాన్‌ సైనిక ఘర్షణ తర్వాత భారత్‌-చైనా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. వియత్నాం ఇప్పటికే శాంసంగ్‌ సంస్థకు తయారీ హబ్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: