దావోస్‌లో సీఎం జగన్ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ఆయన ఏపీ పెవిలియన్‌ లో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టైనబిలిటీ విభాగాధిపతి పెట్రో గొమేజ్‌తో సీఎం భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌తో ఫ్లాట్‌ఫాం పార్టనర్‌షిప్‌పై సీఎం జగన్ ఒప్పందం చేసుకున్నారు. అలాగే బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌ పాల్‌తో బక్నర్‌తో సీఎం భేటీ అయ్యారు. ఇంకా పలువురు గ్లోబల్ లీడర్స్‌తో సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ పెవిలియన్‌కు మంచి ఆదరణ లభిస్తోందని వారు చెబుతున్నారు. అదే సమయంలో సీఎం జగన్‌ను మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్య థాకరే కలిశారు. సీఎం జగన్ తో అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ కూడా భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇక ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై నిన్న ఏపీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: