వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత గిఫ్ట్‌ పంపుతానంటున్నారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా. కాలిక్యులేటర్.. ఎందుకో తెలుసా.. చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో విజయసాయి రెడ్డి ఓపికగా లెక్కేసుకోవాలనికట. ఇందు కోసం కావాలంటే ఉచితంగా కాలిక్యులేటర్ పంపుతామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారు. టీడీపీ  హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల వివరాలు వైకాపా ప్రభుత్వం బయట పెట్టిందని అయ్యన్న గుర్తు చేశారు.

బహుశా విజయసాయి రెడ్డి విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి చూడలేదేమోనని అయ్యన్న సెటైర్ వేశారు. భారీ, మధ్య, చిన్న తరహా కలిపి 39450 పరిశ్రమలు, 5,13,351 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిందని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి ఎం మొహం పెట్టుకొని దావోస్ వెళ్ళారని అయ్యన్న ప్రశ్నించారు. మూడేళ్ల నుంచి టీడీపీ నాయకుల సంగతి తేలుస్తూనే ఉన్న విజయ సాయిరెడ్డి... సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్ కి ప్రత్యేక విమానంలో వెళ్ళిన జగన్ రెడ్డి సంగతి తేల్చాలని అయ్యన్న సవాల్‌ విసిరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: