తెలంగాణకు పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేందుకు లులూ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో భేటీ అయ్యారు. తెలంగాణలో 500 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ఈ సంస్థ అధిపతి ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని లులు గ్రూప్ తెలిపింది. లులు గ్రూప్‌ ఏర్పాటు చేసే  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున అవసరమైన అనుమతి పత్రాలను కేటీఆర్ ముందుగానే సంస్థ అధిపతి యూసుఫ్ అలీ కి అందజేయడం విశేషం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి తెలంగాణలో మరో ప్రాంతంలోనూ తమ యూనిట్ ప్రారంభిస్తామని ఆ సంస్థ వివరించింది. తెలంగాణలోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని లులు గ్రూప్‌ చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: