దావోస్‌ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును తెలంగాణ సద్వినియోగం చేసుకుంటోంది. ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే లులు వంటి ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు భారీ వాణిజ్యసముదాయాల నిర్మాణం కోసం కూడా కంపెనీ తరపున పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలను ఎంచుకుంది. హైదరాబాద్ లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ కీమో ఫార్మా కూడా ప్రకటించింది. వంద కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. అలాగే స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన స్విస్ రే కంపెనీ హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: