హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌-ఐఎస్‌బి 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ రానున్నారు. రేపు జరిగే ఈ కార్యక్రమంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారని కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఎస్‌బిని 2001 డిసెంబర్ 2న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రారంభించారు. దేశంలోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్ లో ఒకటి గా గుర్తింపు ను తెచ్చుకొంది. మానవ వనరుల సామర్ధ్య నిర్మాణం పెంపుదలలో తోడ్పాటు కోసం అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంది.

హైదరాబాద్‌లో రేపు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ చెన్నై వెళ్తారు. అక్కడ  31వేల 4వందల కోట్ల రూపాయల విలువైన 11 ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. కొన్ని ప్రాజక్టులను జాతికి అంకితం చేయనున్నారు. 28వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన ఆరు కీలక ప్రాజక్టులకు శంఖుస్థాపన చేస్తారు. రైల్వే లైన్లు, సబర్బన్‌ ప్రాజక్టులు, సహజవాయు సరఫరా పైపులైను మార్గాలు, ప్రధాని ఆవాస్‌ యోజన్‌ అర్బన్‌ ప్రాజక్టులు ప్రారంభించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: