వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. పూర్తిగా టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నారు. పాపం.. ఆయన్ను పార్టీ నుంచి పంపేయాలని జగన్ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకే ఆయన్ను వదిలేశారు. కానీ.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం వైసీపీని వదలడం లేదు. తనపై అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్న వైసీపీ నేతలు.. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.


తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వారి సంగతేంటని నిలదీశారు. వారిపై అనర్హత వేటు వేయించిన తర్వాత తన గురించి మాట్లాడాలన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరి నిసిగ్గుగా తిరుగుతున్నారని రఘురామ విమర్శించారు. అలాంటి  వారికి వర్తించని ఫిరాయింపు నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని రఘురామ ప్రశ్నించారు. తాను.. పార్టీ అద్యక్షుడిగా జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని గుర్తు చేశానే తప్ప..  నియమావళికి విరుద్దంగా ప్రవర్తించలేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: