అమెరికా భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. పక్కన ఉన్న చైనాతో పోల్చి మరీ భారత్‌ను ఆకాశానికి ఎత్తేసింది. జపాన్‌లో జరుగుతున్న క్వాడ్ భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో పోలుస్తూ భారత్ ను తెగ మెచ్చుకున్నారు. ఎందుకంటే కరోనా అంశంలో ఆయన ఈ రెండు దేశాలను పోల్చారు. కరోనాను  ఎదుర్కోవడంలో భారత్ వంటి ప్రజాస్వామ్యం విజయం సాధించిందని జో బైడెన్‌  అన్నారు. భారత్ తో సమాన స్థాయిలో ఉన్నా చైనా ఈ విషయంలో విఫలమైందని జో బైడెన్‌  విమర్శించారు.


ఎంతైనా ప్రజాస్వామ్య దేశమే మంచి ఫలితాలు రాబట్టగలదని జో బైడెన్‌  అన్నారు. ప్రధాని మోదీ పని తీరు ఇందుకు నిదర్శనం అని జో బైడెన్‌ అన్నారు. రష్యాపై కూడా బైడెన్ విమర్శలు చేశారు. మారుతున్న ప్రపంచాన్ని రష్యా, చైనా లాంటి అరాచక శక్తులు చక్కగా నడిపించలేవని జో బైడెన్‌  విమర్శించారు. సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియ లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే ఇందుకు కారణమని జో బైడెన్‌  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: